రేషన్ డీలర్ పై కేసు నమోదు..

ప్రతినెల పేద ప్రజలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని డీలర్ పేదల కడుపు కొడుతూ ప్రతినెల వచ్చిన కోటా నుంచి బియ్యాన్ని ఇవ్వకుండా నిలువ ఉంచుకున్న డీలర్ పై విసుగు చెందిన గ్రామస్తులు సంబంధిత ఇన్ఫోర్స్మెంట్ అధికారి డీటీ రవికుమార్ కు గ్రామస్తులు సమాచారం అందజేశారు.

Update: 2023-03-17 16:27 GMT

దిశ, అచ్చంపేట: ప్రతినెల పేద ప్రజలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని డీలర్ పేదల కడుపు కొడుతూ ప్రతినెల వచ్చిన కోటా నుంచి బియ్యాన్ని ఇవ్వకుండా నిలువ ఉంచుకున్న డీలర్ పై విసుగు చెందిన గ్రామస్తులు సంబంధిత ఇన్ఫోర్స్మెంట్ అధికారి డీటీ రవికుమార్ కు గ్రామస్తులు సమాచారం అందజేశారు.

శుక్రవారం సంబంధిత ఎన్ఫోర్స్మెంట్ అధికారి నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండల పరిధిలోని ఐనోలు గ్రామంలో డీలర్ గా పని చేస్తున్న మనెమ్మ డీలర్ షాపుకు వచ్చిన కార్డుదారులకు బియ్యం లేవని, బియ్యం ఇవ్వకుండా పప్పు, ఉప్పులు ఇస్తున్నారని గ్రామస్తుల సమాచారం మేరకు.. షాప్ నెంబర్ 25 ను తనిఖీ చేయగా 4 క్వింటాళ్ల 30 కేజీల బియ్యం అదనంగా ఉండడంతో డీలర్ మన్నెమ్మపై 6A కేసు నమోదు చేసి, షాప్ సీజ్ చేశామని తెలిపారు. డీలర్ షాపును తాత్కాలికంగా హాజీపూర్ గ్రామానికి చెందిన లక్ష్మి నారాయణ డీలర్ కు అప్పగించామన్నారు.

Tags:    

Similar News