నల్లమలలో భారీ వర్షం.. శ్రీశైలం ఘట్ రోడ్‌లో విరిగి పడ్డ కొండ చర్యలు

నల్లమల్ల లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట పాతాళ గంగ మధ్యన సుమారు 10 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం డ్యాం ప్రధాన మలుపుల వద్ద పలు చోట్ల కొండ చర్యలు విరిగి పడ్డాయి.

Update: 2024-09-01 04:51 GMT

దిశ, అచ్చంపేట: నల్లమల్ల లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట పాతాళ గంగ మధ్యన సుమారు 10 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం డ్యాం ప్రధాన మలుపుల వద్ద పలు చోట్ల కొండ చర్యలు విరిగి పడ్డాయి. రెండు రోజుల నుంచి వర్షాలకు బాగా మెత్తబడడంతో బండరాళ్లు కదులుతూ శ్రీశైలం రహదారిపై పడటం మూలంగా వాహన చోదకులు రాత్రి సమయంలో అవస్థలు పడుతూ చాలా నెమ్మదిగా భయం భీతితో ఈ సందర్భంగా శ్రీశైలం ప్రాజెక్టు ప్రధాన మూల పలుకుల వద్ద ఇబ్బందులు పడుతున్నారు.

రోడ్డుపై పడిన కొండ చర్యలను తొలగించే పరిస్థితులు లేకపోవడంతో సంబంధిత జాతీయ రహదారుల నిర్వాహణ అధికారులఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావున సిబ్బంది శ్రీశైలం వెళ్లే యాత్రికులు వాహనదారులు కాస్త అప్రమత్తతతో వాహనాలను నడపకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కావున వాహన చోదకులు రాత్రి సమయాలలో మరింత జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణాలు రద్దు చేసుకుంటే మరీ మంచిదని అమ్రాబాద్ సిఐ శంకర్ తెలిపారు.


Similar News