ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం

Update: 2024-08-08 09:56 GMT

దిశ, కొల్లాపూర్: తరచూ ఏదో ఒక చోట అమ్మాయిలపై, మైనర్ బాలికలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని శిక్షలు విధించినా సరే కామాంధులకు బుద్ధి రావట్లేదు. తాజాగా మైనర్ బాలికపై లైంగిక దాడికి యత్నించిన ఘటన కొల్లపూర్ లో చోటుచేసుకుంది. పట్టణంలోని ఒకటో వార్డుకు చెందిన దంపతులకు ఇల్లు లేకపోవడంతో పిల్లలతో అదే వార్డులో ఉన్న ఓ రాజకీయ నాయకుడి షెడ్ లో తాత్కాలికంగా నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ స్థానికంగా ఉండే హోటళ్లలో వర్కర్లుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. గత బుధవారం కూడా ఇద్దరూ పనికి వెళ్లారు. అయితే వారి ఏడేళ్ల బాలిక మాత్రం ఇంట్లోనే ఉంది. జోగులాంబగద్వాల జిల్లా మనోవపాడుకు చెందిన ఓ వ్యక్తి తన భార్య తో కలిసి కొల్లాపూర్ శివారులో గొర్లు మేత కోసం కొంత కాలం క్రితం వచ్చాడు. మధ్యాహ్నం గొర్రెలను ఒకటో వార్డు పరిసర ప్రాంతంలో మేపుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలోనే అతని కన్ను ఏడేళ్ళ బాలిక పై పడింది. ఆ బాలికను బలవంతంగా పక్కనే ఉన్న మాటుకు ఎత్తుకు పోయి లైంగిక దాడికి యత్నించాడు. సదరు బాలిక కేకలు వేయగా స్థానికులు గమనించి దుండగుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి గురువారం వైద్య పరీక్షల నిమిత్తం బాలికను నాగర్ కర్నూల్ జిల్లా హాస్పిటల్ కు తరాలించారని తెలిసింది. కాగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ యాదవ్ గురువారం కొల్లాపూర్ కు చేరుకొని అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లుగా తెలిసింది. ఈ ఘటనను కొల్లాపూర్ పోలీసులు గోప్యంగా ఉంచారు.

Tags:    

Similar News