మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు
పెద్ద కొత్తపల్లి మండలం నాయినేని పల్లి మైసమ్మ దేవత దర్శనానికి భక్తులు పోటెత్తారు.
దిశ, పెద్ద కొత్తపల్లి: పెద్ద కొత్తపల్లి మండలం నాయినేని పల్లి మైసమ్మ దేవత దర్శనానికి భక్తులు పోటెత్తారు. మొక్కుకుంటే కోర్కెలను తీర్చే మైసమ్మ దేవతకు ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచే కాకుండా తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. దేవతకు కోళ్లు, పొట్టేలు బలి ఇచ్చి నైవేద్యంతో మొక్కులు తీర్చుకున్నారు. జాతర మైదానం భక్తులతో సందడిగా మారింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.