అందరూ కలిసి అభివృద్ధి చేయాలి : MLA Abraham
స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి కట్టుగా పనిచేసి అలంపూర్ పురపాలికను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే అబ్రహం అన్నారు.
దిశ, అలంపూర్ టౌన్ : స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి కట్టుగా పనిచేసి అలంపూర్ పురపాలికను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. పుర చైర్పర్సన్ మనోరమ అధ్యక్షతన శనివారం నిర్వహించిన అలంపూర్ పురపాలిక సాధారణ సమావేశంలో ఎమ్మెల్యే అబ్రహం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురపాలిక లో జరుగుతున్న పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.6 కోట్లతో సీసీ రోడ్ పనులు, రూ.1.50 కోట్లతో మున్సిపల్ కార్యాలయం భవనం, రూ.2 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అదేవిదంగా రూ.3.5కోట్ల తో పట్టణంలో ఏర్పాటు చేస్తున్న సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మనోరమ, వైస్ చైర్మన్ శేకర్ రెడ్డి, కమిషనర్ నిత్యానంద్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు పాల్గొన్నారు.