ఆ ప్రధాన రహదారిపై ప్రయాణించాలంటే హడలే..
ప్రధాన రహదారులు ప్రమాదకరంగా మారాయి.
దిశ, చిన్నంబావి: ప్రధాన రహదారులు ప్రమాదకరంగా మారాయి. రహదారుల గుండా ప్రయాణించాలంటే వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు చేయాల్సి ఉన్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు,ప్రయాణీకులు వాపోతున్నారు. చిన్నంబావి మండలం బెక్కేం గ్రామం నుంచి మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టు మధ్యలో రంధ్రం పడింది. రహదారికి మధ్యలో ఉన్న ఈ రంధ్రం ప్రమాదకరంగా మారింది. నిత్యం రోడ్డుపై వెళ్లే వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. రోడ్డు పై వెళ్లే వాహనదారులు ఏ మాత్రం యాది మరిచిన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఉన్నత అధికారులు స్పందించి రంధ్రం పడ్డ కల్వర్టుకు మరమ్మత్తులు చేసి ఏలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.