వీధి కుక్కల దాడిలో 30 గొర్రె పిల్లలు మృతి

మానోపాడు మండల పరిధిలోని జల్లాపురం గ్రామంలో వీధి కుక్కలు స్వైర విహరం చేస్తున్నాయి.

Update: 2024-11-17 15:00 GMT

దిశ, మానోపాడు(అలంపూర్):  మానోపాడు మండల పరిధిలోని జల్లాపురం గ్రామంలో వీధి కుక్కలు స్వైర విహరం చేస్తున్నాయి. గుంపులుగా సంచరిస్తూ.. దాడులకు తెగబడుతున్నాయి. వీధి కుక్కల దాడిలో 30 గొర్రె పిల్లలు మృతి చెందిన ఘటన కలకలం రేపుతుంది. బాధితుడు గొల్ల రాముడు తెలిపిన వివరాల ప్రకారం..రోజులాగా పొలం పాకలో గొర్రెలను ఉంచాడు. 12 గంటల సమయంలో వీధీ కుక్కలు ఒక్కసారిగా మందపై దాడి చేశాయి. దీంతో 30 గొర్రెలు మృతి చెందగా.. మరో 10 గొర్రెలు తీవ్ర గాయపడ్డాయి. మృతి చెందిన గొర్రెల విలువ 2 లక్షల వరకు ఉంటుందని బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తమను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. గ్రామంలో కుక్కల బెడద నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల కోరుతున్నారు. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలని పలువురు కోరారు.


Similar News