డ్రైవర్‌ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణం తీసింది.

Update: 2024-11-17 13:58 GMT

దిశ, కొల్లాపూర్/పెద్దకొత్తపల్లి: కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణం తీసింది. ఈ సంఘటన పెద్ద కొత్తపల్లి మండలం కల్వకోల్ బస్టాండ్ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. కొల్లాపూర్ మండలం కుడికిళ్ళ గ్రామానికి చెందిన జిలుగవల్లి నిరంజనమ్మ(56) తన పుట్టింటికి ముష్టిపల్లి గ్రామానికి శనివారం వెళ్ళింది. తిరిగి ఆదివారం స్వగ్రామం కుడికిళ్ళ కు ప్రయాణమై ముష్టిపల్లి స్టేజీ వద్ద బస్సెక్కి కల్వకోల్ వద్ద బస్ దిగింది. అక్కడి నుంచి ఆమె స్వగ్రామం కుడికిళ్లకు రోడ్డు పక్క నుంచి కాలినడకన వెళ్తుండగా..హైద్రాబాద్ నుంచి కారు అతివేగంగా వచ్చి వెనుక నుంచి నిరంజనమ్మను ఢీ  కొట్టింది. దీంతో బాధితురాలు అక్కడిక్కడే మృతి చెందింది. అయితే సదరు కారులో ప్రయాణించిన వారిలో ఇద్దరు యువతులు,మరో ఇద్దరిలో ఒకరు ప్రొఫెసర్, మరొకరు అడ్వకేట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు ఆందోళన శిబిరానికి చేరుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని రంగస్థలంలో ఉన్న ఏఎస్ఐ బాలనారాయణకు సూచించారు. 


Similar News