Manda Krishna : మ‌రో ఉద్య‌మానికి మాదిగ‌, ఉప‌కులాలు సిద్ధం కావాలి.. మంద‌కృష్ణ పిలుపు

ఎస్సీ వర్గీకరణ అమలులో ఎందుకు జాప్యం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సీఎం రేవంత్‌రెడ్డి‌పై ఫైర్ అయ్యారు.

Update: 2024-10-17 09:26 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఎస్సీ వర్గీకరణ అమలులో ఎందుకు జాప్యం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సీఎం రేవంత్‌రెడ్డి‌పై ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన గురువారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. వచ్చే డిసెంబర్ నాటికి వర్గీకరణ లేకుండా ఉద్యోగ నియామకాలు పూర్తి చేయడానికి.. వర్గీకరణ విషయంలో కమిటీలు, కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తూ.. కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని ఇదే సాక్ష్యమన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేసే విషయంలో రాష్ట్రం ముందు ఉంటుందని సీఎం అన్నారు.. రేవంత్ మాటలకు విలువ లేకుండా పోయిందన్నారు. రేవంత్‌ మాటలు మాకు మోసాల లాగే ఉంటాయన్నారు. మాదిగల పట్ల రేవంత్‌వి తేనే పూసిన మాటలన్నారు. నమ్మించడంలో ఘనుడు.. మోసం చేయడంలో అంతకన్నా పెద్ద ఘనుడే అని అన్నారు. మొదటి రాష్ట్రం తెలంగాణే అని ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని ఫైర్ అయ్యారు.

ఈ క్రమంలోనే మరో ఉద్యమానికి మాదిగ, ఉపకులాలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మాదిగల నిరసనలు సీఎం రేవంత్ రెడ్డి ఎదుర్కోవాల్సిందేని తెలిపారు. ఆయన మాటలు నమ్మెదేలేదని, అయన్ను వదిలేది లేదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మాదిగలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. నవంబర్ 4 నుంచి 14 వరకు మాదిగల ధర్మ యుద్ధ దీక్షలు చేపడతామన్నారు. కోదాడ నుంచి నవంబర్ 16 నుంచి డిసెంబర్ 20 వరకు మాదిగల ధర్మయుద్దం రథ యాత్ర మొదలు పెడతామన్నారు. మా ఆవేదన ఇంకా పరీక్షిస్తే ఇంకా ప్రభుత్వంపై యుద్ధం చేస్తూ.. సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌తో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.


Similar News