హైదరాబాద్‌ను పాకిస్థాన్‌గా మార్చకుండా మాధవీ లత అడ్డుకొగలదు: నవనిత్ రవి రాణా

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి మరో మూడు రోజుల గడువు మాత్రమే ఉంది. దీంతో రాష్ట్రంలో జాతీయ పార్టీ నేతలతో ప్రచార హోరు కనిపిస్తుంది.

Update: 2024-05-09 07:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి మరో మూడు రోజుల గడువు మాత్రమే ఉంది. దీంతో రాష్ట్రంలో జాతీయ పార్టీ నేతలతో ప్రచార హోరు కనిపిస్తుంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న బీజేపీ నేతలు, వివిధ రాష్ట్రాల సీఎంలతో ప్రచారం నిర్వహిస్తోంది. అలాగే ఆయా ప్రాంతాల్లో స్టార్ కంపైనర్లతో ప్రచారం చేయిస్తున్నారు. ఇందులో భాగంగానే.. హైదరాబాద్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి నవనిత్ రవి రాణా పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎంఐఎం కుటుంబ కంచుకోట స్థానంలో మాధవి లత సింహంలా పోటీ చేస్తున్నారని.

ఆమె ప్రచార శైలి ప్రజలను బాగా ఆకట్టుకుంటుందని అన్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో ఏఐ ఎంఐఎం కు మద్దతుగా కాంగ్రెస్ కూడా డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని విమర్శించారు. ఒవైసీ వేరే చోట నుండి పోటీ చేసి, భారతదేశంలో ఉన్న ప్రజల నుంచి మాధవి లత కు ఎలాంటి మద్దతు లభిస్తుందో చూడాలిని.. హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ ఈసారి తప్పకుండా మాధవి లతకు ఓటు వేస్తారని నేను ఆశిస్తున్నాను. హైదరాబాద్‌ను పాకిస్థాన్‌‌లాగా మార్చకుండా మాధవి లత తప్పకుండా అడ్డుకోగలదని.. మాధవీ లతను గెలిపిస్తే.. అన్ని విధాల అభివృద్ధి చేస్తుందని చెప్పుకొచ్చారు.


Similar News