బైక్‌ని రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు! పాతబస్తీలో భయానక ఘటన
పాతబస్తీలో ఓ భయానక ఘటన చోటుచేసుకుంది. బైక్‌ని రెండు కిలోమీటర్లు ఓ లారీ డ్రైవర్ ఈడ్చుకెళ్లాడు.
దిశ, డైనమిక్ బ్యూరో: పాతబస్తీలో ఓ భయానక ఘటన చోటుచేసుకుంది. బైక్‌ని రెండు కిలోమీటర్లు ఓ లారీ డ్రైవర్ ఈడ్చుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్‌గా మారింది. ముందు వెళ్తున్న బైక్‌ను లారీ డ్రైవర్ ఢి కొట్టడాడు. దీంతో లారీ డ్రైవర్‌తో బైకర్ గొడవ పడ్డాడు. ఈ ప్రమాదంలో బైక్ లారీ కింద ఇరుక్కుపోయింది. అయితే డ్రైవర్ అలాగే లారీ తీసుకుపోతున్నాడు. కానీ బైకర్ లారీ బ్యానెట్‌పైనే నిలబడి ఆర్థనాదాలు చేసిన లారీ డ్రైవర్ పట్టించుకోలేదు.
దాదాపు రెండు కిలోమీటర్ల లారీ ఆపకుండా డ్రైవర్ నడిపినట్లు తెలుస్తోంది. ఇది గమనించిన ఓ కారు డ్రైవర్ ఇదంతా వీడియో తీశాడు. రోడ్డుపై ఉన్న ఇతర వాహనదారులు కూడా లారీ డ్రైవర్‌ను ఆపాలని సూచించిన కూడా వినకుండా స్పీడ్‌గా వెళ్లాడు. చివరకు రోడ్డుకు అడ్డంగా మరో వాహనం రావడంతో లారీ అగింది. వెంటనే బైకర్ దిగిపోయాడు. అయితే వీడియో ఆధారంగా పోలీసులు లారీ డ్రైవర్‌ను పట్టుకున్నారు.