యూట్యూబర్ హర్షసాయిపై లుక్ అవుట్ నోటీసులు

Update: 2024-10-05 08:25 GMT

దిశ, వెబ్ డెస్క్ : యూట్యూబర్ హర్షసాయిపై నార్సింగి పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు పరారీలో ఉన్న అతడిని పట్టుకునే ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నారు. యూట్యూబర్ హర్షసాయి విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. హర్షసాయి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడని సైబరాబాద్ సీపీకి బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో హర్షసాయి విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

హర్షసాయిపై గత నెలలో అత్యాచారం కేసు నమోదైంది. తనపై అత్యాచారం చేశాడని, నగ్నచిత్రాలు సేకరించి బ్లాక్ మెయిల్ చేశాడని, మెగా సినిమా కాపీ రైట్స్ కోసం తనపై లైంగిక దాడి చేశాడ‌ని ఓ సినీ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. బడాబడా నేరస్తులను సైతం వేగంగా అరెస్టు చేసిన నేపథ్యం ఉన్న తెలంగాణ పోలీసులకు యూట్యూబర్ హర్షసాయిని పట్టుకోవడం సవాల్ గా మారింది. హర్షసాయి బెంగళూరులోనే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


Similar News