SSC Exams: తెలంగాణ రాష్ట్రంలో ఇక నుంచి రెండు రోజుల పాటు 'పది' సైన్స్ ఎగ్జామ్స్

తెలంగాణ(TG) రాష్ట్రంలో ఇక నుంచి పదో తరగతి వార్షిక పరీక్షల్లో(10th Class Annual Exams) జనరల్ సైన్స్ పరీక్షలు వేర్వేరు రోజుల్లో జరగనున్నాయి.

Update: 2024-10-05 10:28 GMT

దిశ, వెబ్‌డెస్క్:తెలంగాణ(TG) రాష్ట్రంలో ఇక నుంచి పదో తరగతి వార్షిక పరీక్షల్లో(10th Class Annual Exams) జనరల్ సైన్స్ పరీక్షలు వేర్వేరు రోజుల్లో జరగనున్నాయి.ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ(Education Department) కీలక నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది.ఇప్పటివరకు ఫిజికల్ సైన్స్(Physical Science), బయాలజీ(Biology) పరీక్షలు ఒకే రోజు నిర్వహిస్తూ వచ్చారు.ఈ సారి నుంచి ఫిజికల్ సైన్స్ పరీక్ష ఒక రోజు..బయాలజీ పరీక్ష మరో రోజు జరగుతుంది. అయితే గతంలో ఈ రెండు ఎగ్జామ్స్ ఒకేరోజు జరగగా తాజాగా రెండు రోజుల పాటు పరీక్షలు జరపాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఒక్కో పేపర్‌కు ఎప్పటిలాగే గంటన్నర సమయం ఇవ్వనున్నట్లు తెలిపింది.మిగతా పరీక్షలకు ఒకటే పేపర్ అయినందున మూడు గంటల పాటు సమయం ఇస్తారు.కాగా కరోనా సంక్షోభం తర్వాత పదో తరగతి వార్షిక పేపర్లను 11నుంచి 6కు తగ్గించిన విషయం తెలిసిందే. 


Similar News