రాహుల్‌గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తా అంటే ఊరుకుంటామా: జగ్గారెడ్డి

మాజీ మంత్రి హారీశ్ రావుపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Update: 2024-10-05 10:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి హారీశ్ రావుపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jaggareddy) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హరీష్‌ రావు(Hareeshrao) రాహుల్‌గాంధీ ఇంటిముందు ధర్నా చేస్తా అంటున్నాడు. ఆనాడు దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది కేసీఆర్‌ కుటుంబం. ఒక్క హామీ కూడా అమలు చేయని నువ్వు.. రాహుల్‌గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తా అంటే ఊరుకుంటామా అంటూ మండిపడ్డారు. అలాగే తెలంగాణ ప్రజలకు మోసపూరితమైన హామీలు ఇచ్చి నువ్వు, నీ మామ ప్రజలను మోసం చేశారు. ప్రజలను మోసం చేసినందుకు కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర దీక్ష చేస్తానని.. హరీష్ రావు.. ఢిల్లీ పోయిన రోజే తాను కేసీఆర్ ఎక్కడ ఉంటే అక్కడ దీక్ష చేస్తానని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఈ రోజు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో రైతు ధర్నా కార్యక్రమం చేపట్టారు.


Similar News