తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారం దిగ్భ్రాంతిని కలిగించింది: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న సమాచారం తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Update: 2024-09-21 14:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న సమాచారం తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఏటా కోట్ల మంది దర్శించుకునే తిరుపతి వెంకన్న ప్రసాదాన్ని అపవిత్రం చేయడం ప్రజల విశ్వాసానికి తూట్లు పొడవడమేనని శనివారం ఆయన ఓ ప్రకటనలో మండిపడ్డారు. తిరుపతిలో అన్యమత ప్రచారం, తిరుమల కొండపైకి మద్యం, మాంసాహారాన్ని తీసుకెళ్లడం, టీటీడీలో అవినీతి, అక్రమాలు కొన్నేళ్లుగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. సనాతన ధర్మం, హిందూ ధార్మిక విశ్వాసాలను దెబ్బతీసే కుట్రలో భాగంగానే ఈ వ్యవహారం జరిగిందని ఆరోపించారు. ప్రతి అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసిన నేరస్తులకు తగిన శిక్ష పడాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలను కించపరిచేలా చేసిన వారు ఎవరైనా సరే శిక్షార్హులేనని బీజేపీ నేత గూడూరు నారాయణ‌రెడ్డి పేర్కొన్నారు. ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబును కోరారు. హిందూ ఆలయాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువుపై ఉందని అన్నారు.


Similar News