పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధికి అందరం కృషి చేద్దాం : మెదక్ ఎంపీ

ప్రజాసేవకే తన జీవితం అంకితం అని మెదక్ పార్లమెంట్ సభ్యులు ఎం రఘునందన్ రావు అన్నారు.

Update: 2024-12-01 16:12 GMT

దిశ, శివంపేట : ప్రజాసేవకే తన జీవితం అంకితం అని మెదక్ పార్లమెంట్ సభ్యులు ఎం రఘునందన్ రావు అన్నారు. పార్టీలకతీతంగా గ్రామాల అభివృద్ధి కోసం అందరం పాటు పడదామని ఆయన చెప్పారు. శివంపేట మండలంలోని పిలుట్ల గ్రామంలో మాజీ సర్పంచ్ శివంపేట మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పెద్దపులి రవి ఆధ్వర్యంలో సొంత డబ్బుతో గ్రామ ప్రజలకు తాగునీటి కోసం మినరల్ వాటర్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పెద్దపులి రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రజాసేవకే తన జీవితం అంకితమని పేర్కొన్నారు. సొంత డబ్బుతో గ్రామ మాజీ సర్పంచ్ శివంపేట మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పెద్దపులి రవి మినరల్ ప్లాంట్ ప్రజల కోసం ఏర్పాటు చేయడం పట్ల ఆయనను అభినందించారు.

గ్రామాల్లోనూ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ఉండి పార్టీ బలోపేతనం కోసం కృషి చేయవలసిన అవసరం ఉన్నదని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించి వారి సంక్షేమం కోసం కృషి చేస్తుందని ఆయన చెప్పారు. వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు వస్తాం సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లోనూ కమిటీలు వేసి అందరి సమన్వయంతో పార్టీ బలోపేతనం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులకు, కార్యకర్తలకు ఆయన సూచించారు. గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు సభలో తెలిపారు.

ముదిరాజ్ సంఘం భవనానికి నిర్మాణానికి ఐదు లక్షలు. గౌడ సంఘం భవన నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు మెదక్ పార్లమెంట్ సభ్యులు ఎం రఘునందన్ రావు తెలిపారు. వచ్చే మార్చిలోగా ఆయా సంఘాల అభివృద్ధి కొరకు నిధులు కేటాయిస్తానని ఈ సమావేశంలో వారికి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు ఏ మురళీధర్ యాదవ్, నర్సాపూర్ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ వాల్దాస్ మల్లేశం గౌడ్, భారతీయ జనతా పార్టీ నాయకులు రమణారావు గూడ, రాజేందర్ పాపా, రమేష్ గౌడ్, అశోక్ షాదుల్లా, వినోద్ కుమార్, భాస్కర్ గౌడ్, గిరి, ఆరే గ్రామాలకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


Similar News