CM Revanth Reddy : విశ్వ వేదికపై తెలంగాణ విజయ గీతిక మ్రోగాలి : సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తెలంగాణ (Telangana)ప్రజలకు ఎక్స్ వేదికగా నూతన సంవత్సరం శుభాకాంక్ష(New Year Wishes)లు తెలిపారు.
దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తెలంగాణ (Telangana)ప్రజలకు ఎక్స్ వేదికగా నూతన సంవత్సరం శుభాకాంక్ష(New Year Wishes)లు తెలిపారు. నవ వసంతంలో విశ్వ వేదికపై విజయ గీతిక(Victory Song)గా తెలంగాణ స్థానం..ప్రస్థానం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ నూతన సంవత్సరం శుభ సంతోషాలను నింపాలని మనసారా కోరుకుంటూ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
అటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణరావు ప్రభృతులు సైతం రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.