ఆ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించండి.. బీజేపీ ఎమ్మెల్యేకు వినతి
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్హాస్పిటల్స్దోపిడీలు పెరిగాయని, వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని ప్రైవేట్ హాస్పిటల్స్ బాధితుల సంఘం ప్రభుత్వాన్ని కోరుతున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్హాస్పిటల్స్దోపిడీలు పెరిగాయని, వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని ప్రైవేట్ హాస్పిటల్స్ బాధితుల సంఘం ప్రభుత్వాన్ని కోరుతున్నది. ప్రత్యేక కమిటీలు వేసి భారీ ఫీజుల విధానాన్ని అరికట్టాలని పేర్కొన్నది. సర్కార్ ఆస్పత్రికి వెళితే సకాలంలో వైద్యం అందడం లేదని, ప్రైవేట్‌కు వెళితే లక్షల ఫీజుల భారాన్ని మోపుతున్నాయని, ఆ భారం మోసే పరిస్థితి పేదల వద్ద లేదని సంఘం అధ్యక్షుడు జగన్ స్పష్టం చేశారు. దీంతో గవర్నమెంట్ ఆస్పత్రుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు ఆయన ఆదివారం వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జగన్మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు, నర్సింగ్ కొరత వేధిస్తున్నట్లు వివరించారు. సీఎం కేసీఆర్ హామీలన్నీ గాలిలో కలిసిపోతున్నాయన్నారు. ఉస్మానియా నూతన బిల్డింగ్, నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, నిమ్స్‌లో బెడ్ల కొరత, ఎమర్జెన్సీ కేర్ఫెసిలిటీలు, నిర్ధారణ యంత్రాలు బ్లడ్ బ్యాంకులు, ఆరోగ్య శ్రీ ఫెండింగ్ తదితర విషయాలపై అసెంబ్లీలో మాట్లాడి పేదలకు న్యాయం చేయాలని రఘునందన్ రావును జగన్ కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు నాగరాజు ప్రధాన కార్యదర్శి బండ మల్లేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.