Lashkar Bonalu: అట్టహాసంగా షురువైన లష్కర్ బోనాల జాతర.. అమ్మవారి దర్శనం కోసం పోటెత్తిన భక్తులు

లష్కర్ బోనాల జాతర ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది.

Update: 2024-07-21 03:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: లష్కర్ బోనాల జాతర ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా భక్తుల కొంగు బంగారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఈ మేరకు పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు, తొట్టెలు, ఫలహార బండ్ల ఊరేగింపులతో అమ్మ వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. మరికొద్దిసేపట్లోనే మహంకాళి అమ్మవారిని సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు దర్శించుకోనున్నారు. వారి దర్శనం కోసం పోలీసులు ప్రత్యేక లైన్లను ఏర్పటు చేశారు. అదేవిధంగా శివసత్తులకు కూడా మరో క్యూ లైన్‌ను సిద్ధం చేశారు. ఇక సోమవారం రంగం భవిష్యవాణి, అమ్మవారి ఊరేగింపుతో జాతరకు ముగింపు పలుకనున్నారు. ఉదయం తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శించుకునేందుక క్యూ కట్టారు. సుమారు 1500 మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లుగా డీజీపీ తెలిపారు. జాతరకు భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వివిధ ప్రాంతాల నుంచి టీజీఎస్ ఆర్టీసీ 175 ప్రత్యేక బస్సులను నడుపనుంది.

Tags:    

Similar News