ఇండోర్, మినీ స్టేడియం,ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు భూసేకరణ : మంత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో క్రీడల అభివృద్ధి కోసం ఇండోర్ స్టేడియం తో పాటు మినీ స్టేడియం ఏర్పాటుకు భూసేకరణ జరుగుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు
దిశ, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో క్రీడల అభివృద్ధి కోసం ఇండోర్ స్టేడియం తో పాటు మినీ స్టేడియం ఏర్పాటుకు భూసేకరణ జరుగుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం కాటారం మండల కేంద్రంలో విజేతలకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతుల పంపిణీ చేశారు. కాటారం సబ్ డివిజన్ ప్రైవేట్ పాఠశాలల ట్రస్మా అధ్యక్షుడు కొట్టే శ్రీశైలం సభ అధ్యక్షత వహించారు.. జ్యోతి ప్రజ్వలన చేసిన మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… కాటారంకు అభివృద్ధి వరాల జల్లు కురిపించారు.
కాటారంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు నిబంధనలు అడ్డంకిగా ఉన్నప్పటికీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు, ఇంజనీరింగ్ కళాశాల కూడా కళాశాల ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన జరుగుతోందని, అన్ని వర్గాల విద్యార్థులు ఒకే చోట విద్యను అభ్యసించేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ద్వారా విద్యాబోధన జరుపనున్నట్లు శ్రీధర్ బాబు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చదువుతోపాటు క్రీడలకు పెద్దపీట వేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాష్ట్రానికి చెందిన తెలంగాణ విద్యార్థులు దేశంలోనూ ప్రపంచంలోనూ ముందుండాలని విద్య కు అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నట్లు శ్రీధర్ బాబు తెలిపారు. మండల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
ఈ పనులు ప్రజల అవసరాలను తీర్చడంలో కీలకంగా ఉంటాయని, పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు. అనంతరం మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ తో పాటు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చీమల సందీప్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేమునూరు ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, కోట రాజబాబు,రైతు సెల్ జిల్లా అధ్యక్షుడు వొన్న వంశవర్ధన్ రావు నాయకులు అయిరినేని నవీన్ రావు, తెప్పెల దేవేందర్ రెడ్డి, నాయకులు చల్ల జక్కిరెడ్డి, నాయిని శ్రీనివాస్, కామెడీ వెంకటరెడ్డి, కొట్టే శ్రీహరి, ఆంగోతు సుగుణ, జాడి మహేశ్వరి, చీమల రాజు, కడారి విక్రమ్, అంగజాల అశోక్ కుమార్ పాల్గొన్నారు.