రేవంత్ రెడ్డిని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నంలో కేటీఆర్ సెల్ఫ్ గోల్: శ్రీరామ్ కర్రీ

రేవంత్ రెడ్డిని అప్రతిష్టపాలు చేసేందుకు కేటీఆర్ వ్యాఖ్యలు సెల్ఫ్ గోల్ వ్యాఖ్యలు చేస్తున్నారని శ్రీరామ్ కర్రీ ధ్వజమెత్తారు.

Update: 2024-11-01 06:17 GMT
రేవంత్ రెడ్డిని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నంలో కేటీఆర్ సెల్ఫ్ గోల్: శ్రీరామ్ కర్రీ
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ అంశంలో ప్రజలను బీఆర్ఎస్ తప్పుదారి పట్టిస్తున్నదని ఈ విషయంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న వాదన సెల్ఫ్ గోల్, ఫేక్ న్యూస్ అని తెలంగాణ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా శ్రీరామ్ కర్రీ ధ్వజమెత్తారు. గత సెప్టెంబర్ లో వచ్చిన ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాకింగ్స్ ను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విడుదల చేశారని అయితే ఆ ర్యాంకులు 2022వ సంవత్సరానికి సంబంధించినవన్నారు. కానీ కేటీఆర్, బీఆర్ఎస్ సోషల్ మీడియా మాత్రం ఆ ర్యాంకింగ్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్నట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2024 కు సంబంధించిన ర్యాంకు ఈ సంవత్సరం ముగిసేలోపు రాదన్నారు. అసలు 2022లో తెలంగాణకు సీఎం ఎవరు? పరిశ్రమల శాఖ మంత్రి ఎవరు? ఆ ఏడాది ర్యాకింగ్ లో రాష్ట్రం ఇంత చెత్త ప్రదర్శన ఎందుకు చేసిందని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టను దిగజార్చేందుకే బీఆర్ఎస్ నాయకులు ఈ తరహాలో ట్రోల్స్ చేస్తున్నారని మండిపడ్డారు. 2022 లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నడుపుతున్నది.. మీ హయాంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకుల్లో రాష్ట్ర పరిస్థితికి సంబంధించిన మొత్తం కథను ప్రపంచానికి తెలియజేసినందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.  

Tags:    

Similar News