KTR: రేవంత్‌‌రెడ్డి చేసేది ఫోర్త్ సిటీ కాదు.. ఫోర్ బ్రదర్స్ సిటీ: మాజీ మంత్రి కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్

ముచ్చర్ల కేంద్రంగా సీఎం రేవంత్‌‌రెడ్డి (CM Revanth Reddy) చేసేది ఫోర్త్ సిటీ కాదని.. ఫోర్ బ్రదర్స్ సిటీ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు.

Update: 2024-10-05 08:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: ముచ్చర్ల కేంద్రంగా సీఎం రేవంత్‌‌రెడ్డి (CM Revanth Reddy) చేసేది ఫోర్త్ సిటీ కాదని.. ఫోర్ బ్రదర్స్ సిటీ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఇవాళ ఆయన మహేశ్వరం నియోజకవర్గ (Maheshwaram Constituency పరిధిలోని కందుకూరు (Kandukur) వద్ద నిర్వహించి రైతు ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ సర్కార్ (Congress Government) పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అర్హులైన రేతులందరికీ వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కో ఎకరానికి రూ.15 వేల చొప్పున రైతు భరోసా ఇవ్వాలని అన్నారు. వడ్లకు బోనస్ ఇస్తానని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు. కేవలం బోనస్ పేరుతో బోగస్ మాటలు చెప్పి రైతులను మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ (Congerss) వస్తే.. రూ.4 వేల పింఛన్ ఇస్తానని చెప్పిన ఈ ప్రభుత్వం ఆ విషయాన్ని విస్మరించిందని కేటీఆర్ (KTR) ధ్వజమెత్తారు.

2015 నుంచి 2022 వరకు ఎంతో శ్రమించి ఫార్మా సిటీ (Pharma City) కోసం రైతుల నుంచి 14 వేల ఎకరాల భూమి తమ ప్రభుత్వం సేకరించిందని అన్నారు. ఆ భూములు ఫార్మా సిటీ (Pharma City)కి తప్పా.. ఫ్యూచర్ సిటీ (Future City)కి వినయోగించడానికి వీలు లేదని అన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress) నిరుపేదల భూములను గుంజుకోవడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూముల్లో ఫ్యూచర్ సిటీ ఎలా కడతారని ప్రశ్నించారు. ఏఐ సిటీ, ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అంటూ దొంగ నాటకాలు ఆడుతున్నారని కామెంట్ చేశారు. రేవంత్‌రెడ్డి (Revanth Reddy) చేసేది ఫోర్త్ సిటీ కాదని.. ఫోర్ బ్రదర్స్ సిటీ అని ఎద్దేవా చేశారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో రైతులు, ప్రజలంతా ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని అన్నారు.

రేవంత్‌రెడ్డి (Revanth Reddy )కి కమీషన్ల పిచ్చి తప్పా.. ప్రజా సంక్షేమం పట్టదని అన్నారు. ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రులు కూడా దిక్కుమాలిన మాటలు మట్లాడుతున్నారని కామెంట్ చేశారు. ఇక నుంచి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఏ మాత్రం సహించేది లేదని అన్నారు. ఇప్పటికే మంత్రిపై పరువు నష్టం దావా వేశానని, అవసరం అయితే సీఎం రేవంత్‌రెడ్డిపై కూడా పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. 


Similar News