ప్రగతి భవన్‌ను ఖాళీ చేసిన కేటీఆర్

ప్రగతిభవన్‌ను కేటీఆర్ సోమవారం ఖాళీ చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో 2014లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Update: 2023-12-04 15:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రగతిభవన్‌ను కేటీఆర్ సోమవారం ఖాళీ చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో 2014లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నివాసాన్ని ప్రగతిభవన్‌కు మార్చారు. కేసీఆర్‌తో కలిసి ఉంటున్నారు. అయితే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 మంది ఎమ్మెల్యేలను గెలిచి రెండోస్థానంలో నిలిచింది. దీంతో నివాసాన్ని ఖాళీ చేశారు.

హైదరాబాద్ శివారులోని జన్వాడలోని ఫాం హౌస్‌కు నివాసాన్ని మార్చారు. నందినగర్‌లో ఇళ్లు ఉన్నప్పటికీ అధికారిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. పార్టీ కార్యక్రమాలను తెలంగాణ భవన్ నుంచి కొనసాగిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. అదే విధంగా ప్రచార రధాలతో పాటు కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేసిన బస్సు సైతం తెలంగాణ భవన్‌కు చేరింది. ఇప్పటివరకు ప్రగతిభవన్‌లో ఉన్న ప్రచారరథాలను తీసుకొచ్చి నిలిపారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..