15 ఏళ్ల క్రితం కార్మికుడి దుస్తుల్లో KTR.. రేర్ ఫొటో షేర్ చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్

ట్విట్టర్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కేటీఆర్ 15 ఏళ్ల క్రితం దిగిన ఓ రేర్ ఫొటోను పంచుకున్నారు.

Update: 2024-06-27 04:00 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ట్విట్టర్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కేటీఆర్ 15 ఏళ్ల క్రితం దిగిన ఓ రేర్ ఫొటోను పంచుకున్నారు. ‘థ్రో బ్యాక్ 15 ఏళ్ల క్రితం సింగరేణి సోదరులకు సంఘీభావంగా ఆనాడు నిల్చున్నాను.. వారికి గతంలో కంటే ప్రస్తుతం మా మద్దతు అవసరం’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు సింగరేణి కార్మికుల దుస్తుల్లో తలకు సేఫ్టీ హెల్మెట్ పెట్టుకుని ఓ చేతిలో టార్చ్, మరో చేతిలో కార్మికుని పనిముట్టు పట్టుకుని ఉన్న ఫొటోను కేటీఆర్ జత చేశారు. అయితే ఇటీవల బొగ్గు గనుల అమ్మకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కేటీఆర్ ట్విట్టర్ వేదికగా రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుపై సీరియస్ అవుతున్న విషయం తెలిసిందే.

 


Similar News