KTR : ఇప్పుడే ఢిల్లీలో అడుగుపెట్టా! అప్పుడే వణికితే ఎలా? కేటీఆర్ సెన్సేషనల్ ట్వీట్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హుటాహుటిన ఢిల్లీకి బయలు దేరిన విషయం తెలిసిందే.

Update: 2024-11-11 12:27 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR Went Delhi) హుటాహుటిన ఢిల్లీకి బయలు దేరిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా కేటీఆర్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్‌ (Manohar Lal Khattar) ను కలవబోతున్నారు. అయితే, కేటీఆర్ ఢిల్లీ ప్రయాణంపై తెలంగాణ (Congress) కాంగ్రెస్ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) , పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలు, కేసుల నుంచి తప్పించుకోవడానికి కేటీఆర్ ఢిల్లీ టూర్‌కు వెళ్లాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తన ఢిల్లీ టూర్‌పై మంత్రులు చేస్తున్న విమర్శలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు. ‘అప్పుడే వణికితే ఎలా? ఇప్పుడే ఢిల్లీలో అడుగుపెట్టాను, హైదరాబాద్‌లో ప్రకంపనలు ప్రారంభమైనట్లు తెలిసింది’ అంటూ కేటీఆర్ నవ్వుతున్న ఎమోజీ పెడుతూ సెన్సేషనల్ ట్వీట్ చేశారు.

అయితే, అమృత్ టెండర్ల విషయంలో జరిగిన అవకతవకలపై మాజీ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయబోతున్నారు. రూ. 8888 కోట్ల విలువైన టెండర్లను సీఎం రేవంత్ రెడ్డి బావమరిదికి అక్రమంగా కట్టబెట్టారని కేటీఆర్ గతంలో ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ టెండర్ల విషయంలో సృజన్ రెడ్డికి చెందిన షోద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ అపాయింట్ మెంట్ తీసుకుని కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు.

Tags:    

Similar News