మేఘా సంస్థపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

సుంకిశాల పనులు చేపడుతున్న మేఘా కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్, మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.

Update: 2024-08-10 10:09 GMT

దిశ, వెబ్ డెస్క్ : సుంకిశాల పనులు చేపడుతున్న మేఘా కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్, మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హడావిడిగా పనులు చేయిస్తుండటం వల్లే ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, సీఎం రేవంత్ రెడ్డి చేతగానితనం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మండిపడ్డారు. త్వరలోనే సుంకిశాలను దర్శించి నిజ నిజాలను బయటికి తెస్తామని కేటీఆర్ అన్నారు. ఈ ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేసిన కేటీఆర్.. ప్రాజెక్టు నిర్మిస్తున్న ఏజెన్సీ మేఘా కంపెనీని తక్షణమే బ్లాక్ లిస్టులో పెట్టాలని అన్నారు. ఆగస్టు 2వ తేదీన ప్రమాదం జరిగితే వారం రోజులపాటు విషయం బయటకు రాకుండా ప్రభుత్వం దాచిందని దుయ్యబట్టారు. ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్ల కోట్లాది రూపాయల ప్రజల సంపద నీటిలో కొట్టుకుపోయిందని అన్నారు. ఇంతజరిగినా సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో తిరుగుతున్నారు కాని కనీసం రివ్యూ ఏంటని కూడా కనుక్కోలేదని, ఇంతకంటే బాధ్యతా రాహిత్యం మరొకటి లేదన్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగితే మేము వెంటనే బయట పెట్టాము కాని ఇలా వారం పాటు దాయలేదని, సుంకిశాల ప్రాజెక్టు ప్రమాదం ఎలా జరిగిందన్న నిజాన్ని కప్పిపుచ్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందన్నారు. త్వరలోనే సీనియర్ ఇంజనీర్లతో సహ ప్రాజెక్టును సందర్శించి అసలు విషయాన్ని ప్రజల ముందుకు తెస్తామని కేటీఆర్ అన్నారు.         


Similar News