ఆక్రమణ అయితే నేనే కూల్చివేస్తా : కేటీఆర్

జన్వాడ ఫామ్ హౌస్ పై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-21 10:07 GMT

దిశ, వెబ్ డెస్క్ : జన్వాడ ఫామ్ హౌస్ పై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఆ ఫామ్ హౌస్ ఆక్రమణ కిందికి వస్తే తానే దగ్గరుండి కూల్చి వేయిస్తాను అన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ తనది కాదని, అది తన మిత్రుడిది అని వెల్లడించారు. తన మిత్రుడి దగ్గర దానిని లీజుకు మాత్రమే తీసుకున్నాని అన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చివేయడం మంచి నిర్ణయమే అని, మంచి ఎవరూ చేసినా ఆహ్వానిస్తాము అన్నారు. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఫామ్ హౌస్ లు ఉన్నాయని వాటిని కూల్చే ధైర్యం ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఫామ్ హౌస్ ఉంది, మరి దాని సంగతి ఏమిటని అన్నారు. తప్పు జరిగితే నేను కూల్చివేయడానికి రెడీగా ఉన్నాను, మరి మీరు కూడా సిద్ధంగా ఉన్నారా అని సవాల్ విసిరారు. 


Similar News