రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన ఆరోపణలు
ప్రగతిభవన్‌ను నక్సలైట్లు పేల్చేయాలని ఇటీవల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అసెంబ్లీ వేదికగా మంత్రి కేటీఆర్ స్పందించారు.
దిశ, వెబ్ డెస్క్: ప్రగతిభవన్ ను నక్సలైట్లు పేల్చేయాలని ఇటీవల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అసెంబ్లీ వేదికగా మంత్రి కేటీఆర్ స్పందించారు. రేవంత్ రెడ్డి దారుణంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రగతిభవన్ ను పేల్చేయాలని అనొచ్చా ఇదేనా కాంగ్రెస్ విధానం అని ప్రశ్నించారు. ధరణిని రద్దు చేస్తామని పీసీసీ చీఫ్ అంటున్నారు.. సభలో మాత్రం రద్దు చేయబోమని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారని మండిపడ్డారు.
రేవంత్ దోస్తానాతో భట్టి, శ్రీధర్ బాబు చెడిపోయారన్నారు. ఆర్టీఐ పేరుతో పీసీసీ దందా చేస్తున్నారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలో రూ.కోట్లలో వసూలు చేశారని తెలిపారు. రిటైర్డ్ ఆఫీసర్లతో రేవంత్ ఈ తతంగాన్ని నడుపుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు. దందాలు చేసే రేవంత్ లాంటి వాళ్లకు ధరణి వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు.