KTR: మూసీ సుందరీకరణ పేరుతో రూ.వేల కోట్ల స్కాం: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
మూసీ సుందరీకరణ పేరులో ప్రభుత్వం రూ.వేల కోట్ల స్కాంకు తెర లేపిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: మూసీ సుందరీకరణ పేరులో ప్రభుత్వం రూ.వేల కోట్ల స్కాంకు తెర లేపిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఇవాళ ఆయన బీఆర్ఎస్ (BRS) నేతలతో కలిసి ఫతేనగర్ (Fathenagar), కూకట్‌పల్లి (Kukatpally)లోని మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని (STP) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్టీపీల నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు. కూకట్‌పల్లి ఎస్టీపీని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు.
అదేవిధంగా కూకట్‌పల్లి నాలాను శుద్ధి చేయాలని సూచించారు. హైదరాబాద్ (Hyderabad)ను మురికినీటి రహిత నగరంగా మార్చాలనే గొప్ప లక్ష్యంగా తమ ప్రభుత్వ హయాంలో ఎస్టీపీలను ప్రారంభించామని పేర్కొన్నారు. మొత్తం తమ హయాంలో రూ.3,866 కోట్లతో 31 ఎస్టీపీల నిర్మాణాలను చేపట్టామని గుర్తు చేశారు. మూసీ సుందరీకరణ (Mousse Beautification) పేరులో సర్కార్ రూ.వేల కోట్ల స్కాంకు తెర లేపిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పనులను సైతం ఓ పాకిస్తాన్ (Pakistan) కంపెనీకి అప్పగించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎన్నికల సందర్భంగా డబుల్ బెడ్‌రూం ఇళ్లపై రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క పచ్చి అబద్ధాలు చెప్పారని కేటీఆర్ ఆరోపించారు.