ఇది రాష్ట్ర ప్రజలకు సంతోషకరమైన రోజు: కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల్లో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెండావిష్కరణ చేశారు.

Update: 2023-06-02 04:28 GMT
ఇది రాష్ట్ర ప్రజలకు సంతోషకరమైన రోజు: కేటీఆర్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల్లో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెండావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ర్టాన్ని.. ఎన్నో కుట్రలు, మరెన్నో కుతంత్రాలను ఛేదించి అత్యద్భుత తెలంగాణగా ఆవిష్కరించుకొన్నామని అన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం దేశానికి గమ్య నిర్దేశం చేసే స్థాయికి చేరిందని చేరిందని అన్నారు. ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన గొప్ప సందర్భమని తెలిపారు. ఇది రాష్ట్ర ప్రజలకు సంతోషకరమైన రోజని, వాడవాడలా దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని కోరారు. తొమ్మిదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నామని అన్నారు. నిరంతరాయంగా రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమే అని తెలిపారు.

Tags:    

Similar News