KTR: ఖర్గేజీ.. మీరు చెప్పిందే కరెక్ట్..! బీఆర్ఎస్ నేత సంచలన ట్వీట్

ఖర్గే చెప్పినట్లుగానే ఒకరి ఇంటిని కూల్చివేయడం అన్యాయమని, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఆయన సలహా ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

Update: 2024-08-30 10:45 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఖర్గే చెప్పినట్లుగానే ఒకరి ఇంటిని కూల్చివేయడం అన్యాయమని, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఆయన సలహా ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనుసరిస్తున్న బుల్‌డోజింగ్ విధానంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ప్రియమైన ఖర్గే జీ, మీరు చెప్పినట్లుగా, ఒకరి ఇంటిని కూల్చివేసి, వారి కుటుంబాన్ని నిరాశ్రయులుగా మార్చడం అమానవీయం, అన్యాయమని అన్నారు.

తెలంగాణాలో చట్టం, న్యాయవ్యవస్థ పట్ల తీవ్ర ధిక్కారం జరుగుతున్నది ఇదేనని, మహబూబ్‌నగర్ పట్టణంలోని 75 పేదల ఇళ్లను తెల్లవారుజామున 3 గంటలకు ఎటువంటి నోటీసులు లేకుండా కూల్చివేసిన వీడియో క్రింద ఉందన్నారు. ఈ నిరుపేదల్లో 25 కుటుంబాలు శారీరక వికలాంగులు కూడా ఉన్నారని, చట్టానికి విధి విధానాలు లేకపోతే అది చట్టం కాదని, ఆధునిక నాగరికానికి చెందిన అసహయత అవుతుందని తెలిపారు. దయచేసి దేశంలోనే మరో బుల్‌డోజర్‌ రాజ్‌గా మారకుండా తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సలహా ఇవ్వండి అని ఎక్స్ లో రాసుకొచ్చారు.

కాగా గత ఐదు రోజుల క్రిందట మల్లికార్జున ఖర్గే బుల్ డోజర్ విధానం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఒకరి ఇంటిని కూల్చివేసి, వారి కుటుంబాన్ని నిరాశ్రయులను చేయడం అమానవీయం, అన్యాయమని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనారిటీలపై పదే పదే దాడులు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, రూల్ ఆఫ్ లా ద్వారా నిర్వహించబడే సమాజంలో ఇటువంటి చర్యలకు స్థానం లేదని తెలిపారు. అలాగే పౌరుల్లో భయాందోళనలు రేకెత్తించేందుకు బుల్‌డోజింగ్‌ను ఉపయోగించే బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని నిర్మొహమాటంగా విస్మరించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. అంతేగాక అరాచకం సహజ న్యాయాన్ని భర్తీ చేయదని, నేరాలు కోర్టులలో తీర్పు ఇవ్వబడాలి కానీ ప్రభుత్వం ప్రాయోజనం చేకూర్చే బలవంతం ద్వారా కాదని అన్నారు.


Similar News