KTR: ‘హైడ్రా’ పేరుతో ప్రభుత్వం హైడ్రామాలు చేస్తోంది: కేటీఆర్ హాట్ కామెంట్స్

నగరంలో ‘హైడ్రా’ (HYDRA) పేరుతో ప్రభుత్వం హైడ్రామాలు చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు.

Update: 2024-09-25 07:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: నగరంలో ‘హైడ్రా’ (HYDRA) పేరుతో ప్రభుత్వం హైడ్రామాలు చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఇవాళ కూకట్‌పల్లి(Kukatpally)లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Government) పాలనను నగర ప్రజలంతా నిశితంగా గమనిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం నిరుపేదల అభ్యున్నతి పాటుపడిందని పేర్కొన్నారు. తమ పాలనలో హైదరాబాద్ నగరానికి బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లను కోటాయించామని గుర్తు చేశారు. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ (Underground Drainage System)ను కూడా పూర్తిగా మెరుగుపరిచామని తెలిపారు.

కానీ, 10 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క మంచి పని జరిగిన దాఖలాలు లేవని, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. ఇక హైదరాబాద్ ట్రాఫిక్ (Hyderabad Traffic) విషయానికొస్తే.. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని ఎద్దేవా చేశారు. వర్షం వస్తే చాలు ఎక్కడపడితే అక్కడ ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అవుతోందని పేర్కొన్నారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం నిరుపేదల ఇళ్లను నేలమట్టం చేస్తూ హైడ్రామాలు చేస్తుందని మండిపడ్డారు. వరుస కూల్చివేతలతో సామాన్యుల వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఒకవేళ ప్రభుత్వం ఆక్రమణలు తొలగించాలనుకుంటే బాధితులకు ప్రత్నామ్నాయం చూపి ఆ పని చేయాలన్నారు. ఆక్రమణలు తొలగించే ముందు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 


Similar News