కాంగ్రెస్‌కు కేసీఆర్ ఫోబియా.. అసెంబ్లీ వేదికగా అధికార పార్టీపై KTR ఫైర్

అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. బుధవారం అసెంబ్లీలో ద్రవ

Update: 2024-07-31 05:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. బుధవారం అసెంబ్లీలో ద్రవ వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తిరిగి కట్టే సత్తా ఉన్నా రాష్ట్రాలకే అప్పులిస్తారని, తెలంగాణను బద్నాం చేసే ప్రయత్నాలు మానుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. సిరి గల తెలంగాణ దివాళ తీసిందనడం సరికాదని హితవు పలికారు. అధికార కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ ఫోబియో పట్టుకుందని ఎద్దేవా చేశారు.

స్టేట్ బడ్జెట్‌లో ఏముందని ప్రభుత్వాన్ని అభినందించాలని, ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయనందుకు అభినందించాలా లేదా డికర్లేషన్లు అమలు చేయనుందకు అభినందించాలా అని సెటైర్ వేశారు. లేదా 420 హామీలను తుంగలో తొక్కినందుకు ప్రశంసించాలా అని ఎద్దేవా చేశారు. హామీ ఇచ్చిన మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందించడం కాదు అభిశంసించాలని ఫైర్ అయ్యారు.


Similar News