CM రేవంత్ జేజమ్మ వచ్చిన ఆ పని చేయలేరు: కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అంటున్నాడు.. కానీ కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయటం రేవంత్ రెడ్డి జేజమ్మతో కూడా

Update: 2024-05-01 10:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అంటున్నాడు.. కానీ కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయటం రేవంత్ రెడ్డి జేజమ్మతో కూడా కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలంటే మొత్తం తెలంగాణనే లేకుండా చేయాలని కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం మే డే పురస్కరించుకుని తెలంగాణ భవన్‌లో కార్మికులతో కలిసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కార్మిక వర్గం పాత్ర మరవలేనిదని, సింగరేణి కార్మికులు కూడా తెలంగాణ ఉద్యమంలో తమ సత్తా చాటారని కొనియాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, బీఆర్ అంబేడ్కర్ సచివాలయం, యాదాద్రి ఆలయం నిర్మాణంలో కార్మికుల శ్రమ ఉందన్నారు. ఉద్యమంలో కేసీఆర్ బొంబాయి, దుబాయ్, బొగ్గు బాయి అని కార్మికులను ఉద్దేశించే అన్నారని గుర్తు చేశారు. కార్మికుల విషయంలో కేసీఆర్ హృదయం చాలా గొప్పదన్నారు.

కరోనా సమయంలో కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఎంతో ఇబ్బంది పడ్డారో మరిచిపోవద్దని.. కార్మికుల కోసం రైళ్లు పెట్టమంటే మానవత్వం లేకుండా చేసింది ఈ మోడీ కాదా..? కార్మికులను చావ గొట్టింది ఇదే మోడీ కదా అని ఫైర్ అయ్యారు. మళ్లీ సిగ్గు లేకుండా బీజేపోళ్లు అంటారు.. మోడీ కారణంగానే మనం బతికి ఉన్నామంటా అని మండిపడ్డారు. మోడీయే వ్యాక్సిన్ కనుగొన్నాడు అని కిషన్ రెడ్డి అంటాడు.. అసలు మనల్ని చావగొట్టనందుకే ఆయనకు ఓటు వేయాలంట.. మోడీ దేవుడని ఇంకొడు అంటాడు.. అసలు మోడీ దేనికి దేవుడు..? కార్మికులను, కర్షకులను చావ గొట్టిన్నందుకా..? దేనికి మోడీ దేవుడని ప్రశ్నించారు. ఈ 30 లక్షల కోట్ల రూపాయల నుంచి రూ. 14 లక్షల కోట్ల రూపాయలను అదానీ, అంబానీ లాంటి పెద్ద పారిశ్రామిక వేత్తలకు రుణ మాఫీ చేశాడు.. నేను చెప్పింది అబద్దమైతే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ చేశారు.

ఉచితాలు ఇస్తే అనుచితం అంటాడు మోడీ.. కానీ బడా పారిశ్రామిక వేత్తలకు మాత్రం రుణమాఫీ చేస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు, కార్మికులకు, రైతులకు ఒక్క పైసా పనిచేసినట్లు చెప్పే దమ్ము బీజేపోళ్లకు ఉందా..? ఏమైనా అంటే జై శ్రీరాం అంటారు.. మనం యాదగిరి గుట్ట కట్టలేదా..? రాజకీయాలను మతాన్ని వాడుకున్నామా అని ప్రశ్నించారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఏలు, పంచాయితీ సెక్రటరీలు, సెర్ఫ్ ఉద్యోగాలు, హోంగార్డులు, సింగరేణి కార్మికులు, చేనేత, గీతా కార్మికులకు ఎంతో మేలు చేసిందని.. భారీగా జీతాలు పెంచిందని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో వీలినం చేశారు.. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా 73 శాతం జీతం పెంచారని గుర్తు చేశారు. దేశంలో 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రమే వారికి బీడీ ఫించన్ ఇవ్వటం జరిగిందన్నారు.

పదేళ్లు అధికారంలో ఉన్న చేసిన పని చెప్పుకోలేని దద్దమ్మలు బీజేపోళ్లని.. చేనేత కార్మికులకు, బీడీ కార్మికులకు జీఎస్టీ వేసిన మొదటి ప్రభుత్వం బీజేపీ అని ఫైర్ అయ్యారు. రేవంత్ సర్కార్ కూడా వచ్చిన నాలుగు నెలల్లోనే చేనేత కార్మికులకు చీరల ఆర్డర్లు బంద్ పెట్టారని.. వాళ్లకు గత ప్రభుత్వం చేసిన మేలు మొత్తం లేకుండా చేశారని ధ్వజమెత్తారు. మళ్లీ మా సిరిసిల్లలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకునేలా చేశారని సీరియస్ అయ్యారు. కులాలు, మతం, జాతి పేరిట కొట్లాడుకుంటే మన దేశం ముందుకు పోమని.. వాటిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే సన్నాసులకు కచ్చితంగా బుద్ధి చెప్పాలన్నారు. అరచేతిలో వైకుంఠం చూపిన రేవంత్ రెడ్డి, పదేళ్లు మోసం చేసిన బడే భాయ్‌కి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

Read More...

ఇదెక్కడి అరాచకం.. కేసీఆర్ గొంతుపై మాత్రమే నిషేధమా: కేటీఆర్ 




Tags:    

Similar News