వేలంలో లడ్డూ కొన్న ముస్లిం జంట.. భాయ్ అంటూ కేటీఆర్ స్పెషల్ ట్వీట్

తొమ్మిది రోజుల పాటు ఘనంగా పూజలు అందుకున్న గణనాథులు గంగ ఒడికి చేరుతున్నారు. మంగళవారం హైదరాబాద్ మహా నగర వ్యాప్తంగా ఒకేరోజు దాదాపు లక్షకు పైగా నిమజ్జనాలు జరిగాయి.

Update: 2024-09-17 13:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: తొమ్మిది రోజుల పాటు ఘనంగా పూజలు అందుకున్న గణనాథులు గంగ ఒడికి చేరుతున్నారు. మంగళవారం హైదరాబాద్ మహా నగర వ్యాప్తంగా ఒకేరోజు దాదాపు లక్షకు పైగా నిమజ్జనాలు జరిగాయి. ఈసారి గణపతి లడ్డూ వేలం పాటలు కూడా రికార్డు స్థాయిలో పలికాయి. బాలాపూర్ లడ్డూ రూ.30 లక్షలు పలకగా.. మరోచోట ఏకంగా రూ. కోటికి పైగా పలికి కనీవినీ ఎరుగని రికార్డు సృష్టించింది. ఇదిలా ఉండగా.. మతసామరస్యాన్ని చాటిచెప్పేలా ఓ చోట ముస్లిం జంట(Muslim couple) గణపతి లడ్డూను వేలంలో దక్కించుకున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని భట్‌పల్లిలో ఆసిఫ్ అనే వ్యక్తి లడ్డూను దక్కించుకున్నారు. తాజాగా దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు. ‘వినాయక చవితి అంటేనే గంగా జమునా తహజీబ్. వేలంలో లడ్డూ గెలుచుకున్న ఆసిఫ్ భాయ్‌కి కంగ్రాంట్స్. శాంతియుత, సామరస్యతపూర్వక తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రార్థించండి. అసలైన తెలంగాణ సంస్కృతి అంటే ఇదే’ అని కేటీఆర్ ట్వీట్ పెట్టారు.



Similar News