KTR, CM Revanth: ఒకే వేదికను పంచుకోబోతున్న సీఎం రేవంత్, కేటీఆర్.. ఆ సందర్భం అదే!

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి అధికార, ప్రతిపక్ష పార్టీల నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విమర్శల జోరు కొనసాగుతోంది.

Update: 2024-09-18 02:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి అధికార, ప్రతిపక్ష పార్టీల నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విమర్శల జోరు కొనసాగుతోంది. పదేళ్ల పాలనను ఎండగడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్‌ (BRS) పార్టీని వరుస ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరోవైపు ఫేక్ హామీలతో హస్తం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ పాలిటిక్స్‌(Telangana Politics)లో ఆస్తకికర పరిణామం చోటుచేసుకోబోతోంది. తెలంగాణలో ప్రభుత్వం మారిన తరువాత మొదటిసారి సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS working President KTR) ఓకే వేదికను పంచుకోబోతున్నారు. సెప్టెంబర్ 21న సుందరయ్య విజ్ఞాన కేంద్రం (Sundaraiah Vignana Kendram)లో ఇటీవలే కన్నుమూసిన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి (CPM National General Secretary Sitaram Yechuri) సంస్మరణ సభ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సీపీఎం నేతలు సీఎం రేవంత్‌‌రెడ్డితో పాటు కేటీఆర్‌ను ఆ సభకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి వారిద్దరూ హాజరుకాబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే, వారిద్దరూ ఒకే వేదికను పంచుకోబోతున్న తరుణంలో ఇద్దరి మధ్య ఎలాంటి పలకరింపులు ఉండబోతున్నాయోనని సర్వత్ర ఆసక్తి నెలకొంది. 


Similar News