సీఎం సహాయనిధికి ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ రూ.25 లక్షల విరాళం

వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ఫిల్మ్ నగర్ కల్చరర్ సెంటర్ (ఎఫ్ఎన్ సీసీ) రూ.25 లక్షలు విరాళం అందజేసింది

Update: 2024-09-19 09:38 GMT

దిశ, వెబ్ డెస్క్ : వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ఫిల్మ్ నగర్ కల్చరర్ సెంటర్ (ఎఫ్ఎన్ సీసీ) రూ.25 లక్షలు విరాళం అందజేసింది. ఫిల్మ్ నగర్ కల్చరర్ సెంటర్ ప్రెసిడెంట్ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు. వరద బాధితులకు మా వంతుగా మేము కూడా అండగా నిలుస్తామని తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు పలువురు ముందుకొచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించిన సంగతి తెలిసిందే. ఫిలిం చాంబర్ తరపున ఏపీకి రూ.25 లక్షలు, తెలంగాణకు రూ.25 లక్షలు, తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ తరపున ఏపీకి రూ.10 లక్షలు, తెలంగాణకు రూ.10 లక్షలు, ఫెడరేషన్‌ తరపున రూ.5 లక్షలు విరాళంగా అందించారు. టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్యమంత్రి సహాయ నిధికి తన తరఫున రూ.50 లక్షలు, తన కుమారుడు రామ్‌ చరణ్‌ తరఫున మరో రూ.50 లక్షలు అందజేశారు.నటులు విశ్వక్‌సేన్‌ రూ.10 లక్షలు, సాయిధరమ్‌ తేజ్‌ రూ.10 లక్షలు, అలీ రూ.3లక్షలు విరాళంగా అందజేశారు. కుమారి ఆంటీ. సైతం రూ.50వేలు విరాళం చెక్కును సీఎం రేవంత్‌రెడ్డికి అందచేశారు.


Similar News