Nandini Sidhareddy : నందిని సిధారెడ్డి నిర్ణయంపై కేటీఆర్, హరీష్ రావుల హర్షం
తెలంగాణ తల్లి విగ్రహం(Telangana Thalli statue) రూపం మార్చడాన్ని నిరసిస్తూ ప్రభుత్వం సన్మాన ప్రతిపాదనను తిరస్కరించిన ప్రముఖ కవి, సాహితీవేత్త నందిని సిధారెడ్డి(Nandini Sidhareddy) తీసుకున్న నిర్ణయం పట్ల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao)లు హర్షం ప్రకటించారు.
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ తల్లి విగ్రహం(Telangana Thalli statue) రూపం మార్చడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ సన్మాన ప్రతిపాదనను తిరస్కరించిన ప్రముఖ కవి, సాహితీవేత్త నందిని సిధారెడ్డి(Nandini Sidhareddy) తీసుకున్న నిర్ణయం పట్ల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao)లు హర్షం ప్రకటించారు. ఎక్స్ వేదికగా సిధా రెడ్డి నిర్ణయాన్ని అభినందించారు. కేటీఆర్ తన ట్వీట్ లో తెలంగాణ తల్లి రూపం మార్చి బతుకమ్మను తొలగించడం మన రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, ఆత్మగౌరవానికి చెరగని మచ్చ అన్నారు. సంస్కృతిని హననం చేసే ప్రభుత్వం చేత సన్మానం చేయించుకోలేనని ప్రకటించి రేవంత్ ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ప్రముఖ కవి నందిని సిధారెడ్డి తీసుకున్న సాహసోపేతమైన ఉదాత్త నిర్ణయం ప్రతి తెలంగాణ వాసికి గర్వకారణమని కొనియాడారు. తెలంగాణ ఆత్మగౌరవం, సంస్కృతి పరిరక్షణకు మీరు చూపిన నిబద్ధతకు నా హృదయపూర్వక అభినందనలన్నారు.
అటు హరీష్ రావు తన ట్వీట్ లో ఆత్మగౌరవ పరిరక్షణ ఉద్యమంలో మీ మార్గదర్శకత్వానికి శిరస్సు వంచి నమస్కారాలని సిధారెడ్డిని అభినందించారు. కోటి రూపాయల కన్నా, కోట్లాది ప్రజల గుండెల్లో కొలువైన తెలంగాణ తల్లే మిన్న అని, బతుకమ్మను తీసేయడం అంటే తెలంగాణ బతుకును అవమానించడమే అని, ప్రభుత్వ పురస్కారాన్ని తిరస్కరిస్తూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని చాటిన నందిని సిధారెడ్డికి హృదయపూర్వక ఉద్యమాభినందనలని హరీష్ రావు పేర్కొన్నారు.