Kothagudem: కేటీపీస్(KTPS) లో పవర్ కూలింగ్ టవర్ల కూల్చివేత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (KTPS) లోని 8 టవర్లను టీఎస్ జెన్ కో అధికారులు ఈ రోజు కూల్చివేశారు.

Update: 2024-08-05 09:58 GMT

దిశ, వెబ్‌డెస్క్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (KTPS) లోని 8 టవర్లను టీఎస్ జెన్ కో అధికారులు ఈ రోజు కూల్చివేశారు. ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ కర్మాగారం కు చెందిన మొత్తం 8 టవర్లను రెండు దశల్లో కూల్చివేశారు. ముందు నాలుగు టవర్లు కూల్చిన అధికారులు.. తర్వాత మరో నాలుగింటిని కూడా ఒకేసారి కూల్చేశారు.'ఓ అండ్ ఎం' ఫ్యాక్టరీ మూతపడటంతో ఆ ప్రాంతాన్ని ఉపయాగించుకోవాలన్న ఉద్దేశంతో వాటిని కూల్చివేయాలని KTPS అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

కాగా.. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ కు చెందిన ఎగ్జిక్యూట్ అనే ప్రైవేట్ సంస్థ ఈ టవర్ల కూల్చివేత ప్రక్రియను నిర్వహించింది. మొత్తం 30 మంది సిబ్బంది నెలరోజుల పాటు ఈ టవర్ల కూల్చివేత కోసం సన్నాహాలు  చేశారు . ఇంప్లోషర్ అనే టెక్నాలజీ ద్వారా ఈ టవర్లను కూల్చివేశారు. తొలుత అధికారులు ఎ స్టేషన్లోని 102 మీటర్ల ఎత్తు కలిగిన 4 టవర్లను కూల్చివేయగా.. ఆ తర్వాత 115 మీటర్ల ఎత్తున్న మరో నాలుగు టవర్లను నేలమట్టం చేశారు .అయితే టవర్ల కూల్చివేత ప్లాంట్ నుంచి విద్యుత్ సరఫరా చేసే లైన్లలో రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కాగా.. ఈ థర్మల్ పవర్ స్టేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి విద్యుత్ ను అందించిన విషయం తెలిసిందే.


Similar News