'సికింద్రాబాద్ ఘటన ప్రభుత్వానికి హెచ్చరిక'
సికింద్రాబాద్ రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని డెక్కన్ స్పోర్ట్స్ వేర్ మాల్ లో సంభవించిన అగ్నిప్రమాదం ప్రభుత్వానికి హెచ్చరిక లాంటిదని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: సికింద్రాబాద్ రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని డెక్కన్ స్పోర్ట్స్ వేర్ మాల్ లో సంభవించిన అగ్నిప్రమాదం ప్రభుత్వానికి హెచ్చరిక లాంటిదని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. శనివారం ప్రమాద ఘటన స్థలాన్ని ఆయన పరిశీలించారు. అధికారులను అడిగి ఘటన వివరాలను తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ ప్రమాదంతో మరణించిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిపుణులతో సర్వే చేయించి నష్టపోయిన వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలన్నారు. అక్రమ కట్టడాలపై ప్రభుత్వం ఇకనైనా స్పందించి చర్యలు తీసుకోవాలని లేకుంటే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని అన్నారు.
ఇవి కూడా చదవండి : సికింద్రాబాద్ ఫైర్ యాక్సిడెంట్ : ఒకరి డెడ్ బాడీ గుర్తింపు