Kishan Reddy: నాలుగేళ్లు కష్టపడండి.. బీజేపీ శ్రేణులకు కిషన్ రెడ్డి కీలక పిలుపు

స్థానిక సంస్థల ఎన్నికల వేళ కిషన్ రెడ్డి కీలక దిశానిర్దేశం చేశారు.

Update: 2024-08-06 13:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిలో ఏ ఒక్కటి అమలు చేయడం లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీస్ లో జరిగిన పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, హర్ ఘర్ తిరంగా అంశాలపై చర్చించారు. పంద్రాగస్టున 11వ సారి ఎర్రకోటలో మోడీ జాతీయ పతాకాన్ని ఎగరవేయనున్నారని ఈ సందర్భంగా తెలంగాణలో ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రాతిపాదికన రుణ మాఫీ చేస్తున్నదో అర్థం కావట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రుణమాఫీకి సంబంధించి మన ఆఫీస్ లో కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం. ఈ నెంబర్ కు ప్రతిరోజు వేల సంఖ్యలో రైతులు కాల్స్ చేస్తున్నారు. కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి మొదట్లో ఒక్కరినీ నియమించాం. కానీ రైతుల నుంచి రోజుకి వేల సంఖ్యలో కాల్స్ వస్తున్నాయి.

వచ్చే నాలుగేళ్లు కష్టపడండి:

రాబోయే నాలుగేళ్లు కష్టపడి పని చేయాలని బీజేపీ నేతలకు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. మనమీద ఆశతో ప్రజలు తెలంగాణలో 36 శాతం ఓటు షేరింగ్ ఇచ్చారని, ప్రజలు ఇచ్చిన తీర్పును సవాలుగా తీసుకొని అంకిత భావంతో పని చేద్దామన్నారు. కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలు స్వాగతం పలికేలా ఉందని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.

Tags:    

Similar News