కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కిషన్ రెడ్డి ఫస్ట్ కామెంట్స్

కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

Update: 2024-06-13 06:48 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా గురువారం కిషన్ రెడ్డి బాధ్యలు స్వీకరించారు. ఢిల్లీలోని శాస్త్రీభవన్ లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తన సతీమణితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించగా పురోహితులు కిషన్ రెడ్డికి వేద ఆశీర్వచనం పలికారు. అంతకు ముందు తెలంగాణ భవన్ లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కుటుంబ సమేతంగా తెలంగాణ భవన్ లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ భవన్ బయట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, పార్టీ నేతలు హాజరయ్యారు. మరో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోష్ కిషన్ రెడ్డి ఛాంబర్ కు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి పదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా బొగ్గు కొరత కారణంగా వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ రంగాల్లో విద్యుత్ కోతలు ఉండేవన్నారు. హైదరాబాద్ లోనూ పారిశ్రమలు విద్యుత్ కోతల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, విద్యుత్ కోతల కారణంగా పంటలు ఎండిపోయి, మోటార్లు కాలిపోయి అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. కానీ ఈ పదేళ్లలో నరేంద్ర మోడీ విద్యుత్ కోతలు లేని నూతన భారత దేశాన్ని ఆవిష్కరించారని చెప్పారు. విద్యుత్ కోతలు నివారంచడంలో బొగ్గు, గనుల శాఖ కీలకమైనదని, రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ కోతలు లేని భారత్ ను నిర్మించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రస్తుతం విదేశాల నుంచి కొంత మేర బొగ్గును దిగుమతి చేసుకుంటున్నామని, రాబోయే రోజుల్లో దేశానికి సరిపడా బొగ్గును మనమే ఉత్పత్తి చేసుకోవాల్సి ఉందన్నారు. మినరల్స్ ను ఇతర దేశాలకు ఎగుమతి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత దేశాన్ని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యస్థగా తీర్చిదిద్దేందుకు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మోడీ నాయకత్వంలో అధికారులతో సమన్వయంతో పనిచేసి దేశ ప్రజలు ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తానన్నారు.

Tags:    

Similar News