Kishan Reddy: మూసీ సుందరీకరణ పేరుతో వంచన కేసీఆర్ ప్లానే: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మూసీ సుందరీకరణ విషయంలో కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-02 12:18 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మూసీ సుందరీకరణ విషయంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీకి రిటైనింగ్ వాల్ కడితే సరిపోతుందన్నారు. బుధవారం అంబర్ పేట ప్రాంతంలోని మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించిన ఆయన బాధితులను పరామర్శించారు. వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన నగరంలో హైడ్రా పేరుతో ప్రభుత్వం టెర్రర్ చేస్తున్నదని ప్రభుత్వమే అనుమతులు ఇచ్చి ఇప్పుడు కూలుస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. పేదల ఇళ్లు కూలుస్తామనంటే ఊరుకోబోమని ఎంత మంది వచ్చినా అడ్డుకుని తీరుతామన్నారు. ఎవ్వరి ఇళ్లనూ కూలగొట్టనివ్వమని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు పేదలకు ఇండ్లు కట్టించాలి కానీ వారి ఇండ్లు కూలుస్తామంటే ఎలా అన్నారు. నిజానికి మూసీ సుందరీకరణ పేరుతో ప్రజలను వంచించే ప్రయత్నం గతంలో కేసీఆర్ చేశారన్నారు. అందులో భాగంగానే మూసీ కార్పోరేషన్ ను సైతం ఏర్పాటు చేశారన్నారు. కేసీఆర్ బెదిరింపులకు తాము లొంగలేదని ఇప్పుడు రేవంత్ రెడ్డి బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదన్నారు. పేదల బస్తీల్లో బుల్డోజర్లు కాదు గడ్డపార దించినా ఊరుకునేది లేదన్నారు. ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కిరాయికి ఉంటున్న పేదలకు ఇండ్లు కట్టివ్వాలన్నారు.


Similar News