Kishan Reddy: కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు దివాళా తీశాయ్.. కిషన్‌రెడ్డి హాట్ కామెంట్స్
కాంగ్రెస్ (Congress) అధికారంలో ఉన్న రాష్ట్రాలు అర్థికంగా పూర్తిగా దివాళా తీశాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) ఘాటు వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ (Congress) అధికారంలో ఉన్న రాష్ట్రాలు అర్థికంగా పూర్తిగా దివాళా తీశాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదరాబాద్ (Hyderabad)లోని బీజేపీ (BJP) ప్రధాన కార్యాయంలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియపై పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కార్యశాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రోగ్రాంకు బీజేపీ తెలంగాణ ఇంచార్జీ సునీల్ బన్సల్ (Sunil Bansal) హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని పార్టీ శ్రేణుకు పిలుపునిచ్చారు. మహిళలు, యువత రైతుల సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం, పత్తి కొనుగోళ్లలో రైతులకు ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని ఆరోపించారు. తేమ, నాణ్యత అంటూ కొర్రీలు పెడుతూ.. ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ (Congress) అధికారంలో వచ్చిందని ఆయన ఫైర్ అయ్యారు. హస్తం పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఆర్థికంగా పూర్తిగా దివాళా తీశాయని కామెంట్ చేశారు. కేవలం 11 నెలల కాలంలో తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ధ్వజమెత్తారు. సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీకి ఊపిరే సంస్థాగత ఎన్నికల వ్యవస్థ అని కిషన్‌రెడ్డి అన్నారు.