Kishan Reddy: బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు రాజకీయాలను భ్రష్టు పట్టించాయ్.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) పార్టీలు తెలంగాణ (Telangana) రాజకీయాలను భ్రష్టు పట్టించాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు.
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) పార్టీలు తెలంగాణ (Telangana) రాజకీయాలను భ్రష్టు పట్టించాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు. ఇవాళ ఆయన హైదరాబాద్ (Hyderabad)లో నిర్వహించిన బీజేపీ (BPP) వర్క్‌షాప్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ (BRS) పాలన తరహాలోనే కాంగ్రెస్ పాలన కోనసాగుతోందని అన్నారు. పాలనలో కాంగ్రెస్.. ప్రజల సమస్యల విషయంలో బీఆర్ఎస్ పార్టీలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని కామెంట్ చేశారు.
ఆ రెండు పార్టీలు తెలంగాణ (Telangana) రాజకీయాలను భ్రష్టు పట్టించాయని ఆరోపించారు. అదేవిధంగా కాంగ్రెస్ (Congress) వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను గాలికొదిలి రెండు పార్టీలు పరస్పరం విమర్శించుకోవడమే పనిగా పెట్టుకున్నాయని ధ్వజమెత్తారు. ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress) నేడు ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. కానీ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో అన్ని హామీలు అమలు చేశామంటూ గొప్పలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) పార్టీలతో తెలంగాణ ప్రజలకు విసిగిపోయి ఉన్నారని కిషన్‌రెడ్డి అన్నారు.