Kishan Reddy: బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కుటుంబ పార్టీలే.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం ప్రజలను కాంగ్రెస్ పార్టీ (Congress Party) వంచనకు గురిచేసిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-04 07:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం ప్రజలను కాంగ్రెస్ పార్టీ (Congress Party) వంచనకు గురిచేసిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad)‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయం (BJP State Head Office)లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వం బుకాయిస్తుందని మండిపడ్డారు. ఆరు గ్యారంటీ (Six Guarantees)లను వంద రోజుల్లోపు అమలు చేస్తామని చెప్పారని.. నేటికీ అందులో ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయలేకపోయారని ఫైర్ అయ్యారు.

ఎన్నికల సందర్భంగా రాష్ట్రానికి వచ్చిన రాహుల్‌‌ గాంధీ (Rahul Gandhi), సోనియా‌ ‌గాంధీ (Sonia Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)‌తో సహా ఆ పార్టీ నేతలంతా విచ్చలవిడిగా హామీలు ఇచ్చారని.. ఇప్పుడు ఆ హామీలు అన్ని ఏమయ్యాయని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం ప్రజలను వంచించారని ఆరోపించారు. కేవలం డిక్లరేషన్లు, గ్యారెంటీలతో కాంగ్రెస్ పార్టీ జనాలను నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు.

తెలంగాణ (Telangana)తో సహా కర్ణాటక (Karnataka), హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రాల్లో పరిస్థితులు ఇలానే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ఆయా రాష్ట్రాల్లో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. రాష్ట్రాలు దివాళా తీస్తే నష్టపోయేది పేదలు, సామన్య ప్రజలేనని పేర్కొన్నారు. కర్ణాటకలోనూ 5 గ్యారంటీలు ఇచ్చి.. అక్కడి ప్రభుత్వం ఒకే ఒక్క హామీని అమలు చేస్తున్నారని తెలిపారు. అక్కడ కాంగ్రెస్ పెద్దలు ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్నారని ఆక్షేపించారు. మోసపూరిత డిక్లరేషన్లతో ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ (Congress) పనిగా పెట్టుకుందని కామెంట్ చేశారు.

మిగులు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Governement) సర్వనాశనం చేసిందని.. కాంగ్రెస్ సర్కార్ (Congress Government) కూడా అదే బాటలో పయనిస్తుందని అన్నారు. బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress)లు రెండు కుటంబ పార్టీలేనని.. దొరికిన చోటు అప్పులు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారని పని చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అప్పులు తీర్చడం కోసం మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయని అన్నారు. కొన్నాళ్లకు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా ఎంతో దూరంలో లేదని కిషన్‌రెడ్డి అన్నారు.

Tags:    

Similar News