పంట నష్టంపై అరకొర సాయం.. కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్‌రెడ్డి
పంట నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం అరకొర సాయం చేస్తుందని కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్‌రెడ్డి పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: పంట నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం అరకొర సాయం చేస్తుందని కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం రైతులను గట్టేక్కించే విధంగా లేదన్నారు. ముఖ్యంగా మొక్కజొన్న పంట నష్టానికి ప్రభుత్వం ఇచ్చే సాయం కనీసం పెట్టుబడికి కూడా సరిపోదన్నారు. ఎకరాకు కనీసం రూ. 15 వేలు చొప్పున ఇవ్వాల్సిన అవసరం ఉన్నదన్నారు. దీంతో పాటు పండ్లు, కూరగాయల తోటల పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నదన్నారు.
గత ఏడాది ఫిబ్రవరిలోనూ వరంగల్ జిల్లా లో మిర్చి తో పాటు మిగతా పంటలు నష్టపోతే కొద్ది శాతం మందికి మాత్రమే సాయం అందించారన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పునరావృతం కాకూడదని సూచించారు. పంట భీమాను అమలుచేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదన్నారు. దీంతో పాటు ప్రకృతి విపత్తులతో పంట నష్టం జరిగితే ప్రభుత్వం స్పెషల్ప్యాకేజీ ని ప్రకటించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.