Kidney Problem:కిడ్నీలు పాడవుతున్నాయ్..రాష్ట్రంలో పెరుగుతున్న వ్యాధిగ్రస్తుల సంఖ్య!
రాష్ట్ర వ్యాప్తంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. చాలా మందికి కిడ్నీలు కరాబ్ అవుతున్నాయి.
దిశ,తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. చాలా మందికి కిడ్నీలు కరాబ్ అవుతున్నాయి. ఇందులో కొందరు డయాలసిస్ మీద చికిత్స పొందుతుండగా, అధిక మోతాదులో ఆర్గాన్ డ్యామేజ్ చెందినోళ్లకు ట్రాన్స్ ప్లాంటేషన్ అనివార్యమైంది. గడిచిన ఏడాదిన్నరలో అత్యధిక కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్‌లు జరిగాయని వైద్యాధికారులు చెబుతున్నారు. 2023లో 287 కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరుగగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 170 కిడ్నీ మార్పిడిలు జరిగాయి. ఇక 2023 నుంచి 2024 (ఇప్పటి వరకు) 273 లివర్ ట్రాన్స్ ప్లాంట్‌లు, 30 హార్ట్, 270 కార్నియా, 118 లంగ్, 2 ప్రాంకియాస్ అవయవ మార్పిడి లు జరిగాయని శనివారం జీవన్ దాన్ 2023–24 రిపోర్టును విడుదల చేసింది.
గడిచిన 30 నెలల్లో 303 మంది డోనర్లు 1150 ఆర్గాన్స్ డొనేట్ చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు 2013 నుంచి 2024(జూలై) వరకు ప్రభుత్వ హాస్పిటల్స్‌లో 550 ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ల సర్జరీలు జరిగాయి. ఇందులో ఏకంగా 499 కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్‌లు నిర్వహించగా, 36 లివర్, 12 హార్ట్ సర్జరీలు చేసి అవయవ మార్పిడిలు విజయవంతంగా పూర్తి చేశారు. అయితే ఇవన్నీ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఉచితంగా చికిత్సను అందజేసినట్లు జీవన్ దాన్ పేర్కొన్నది. పైగా కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే న తెలంగాణ బెస్ట్ స్టేట్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చినట్లు జీవన్ దాన్ అధికారులు వెల్లడించారు.
ప్రభుత్వం వద్ద వివరాలు లేవ్..
రాష్ట్ర వ్యాప్తంగా లైవ్ట్రాన్స్ప్లాంటేషన్సర్జరీలు అధికంగా జరుగుతున్నా, సర్కార్వద్ద స్పష్టమైన లెక్కలు లేవు. అవయవ మార్పిడి లో 60% ఈ విధానంలోనే నడుస్తున్నప్పటికీ, ప్రభుత్వం వద్ద ఈ వివరాలేవీ లేకపోవడం గమనార్హం. కొ న్ని కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు వైద్యశాఖకు వివరాలు సబ్మిట్చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతీ ఏడాది వందల సంఖ్యలో ట్రాన్స్ప్లాంటేషన్లు చేస్తున్నా, ఇవి లెక్కల్లో కి ఎక్కడం లేదు. పూర్తి స్థాయిలో పర్యవేక్షించాల్సిన ఆఫీస ర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులతో కొందరు ఆఫీసర్లు కుమ్మక్కయ్యారని ఆరోపణలు ఉన్నాయి. దీంతోనే లైవ్ట్రాన్స్ ప్లాంటేషన్లపై స్పష్టమైన లెక్కలు లభించడం లేదని స్వయంగా హెల్త్ డిపార్ట్‌మెంట్‌లోనే చర్చ జరుగుతున్నది.