Woman died: ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం.. భర్త మరణం తట్టుకోలేక భార్య బలవన్మరణం
భర్త మరణాన్ని జీర్ణించుకోలేక భార్య మృతి చెందిన ఘటన తల్లాడ మండలంలోని బిల్లుపాడు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
దిశ, తల్లాడ: భర్త మరణాన్ని జీర్ణించుకోలేక భార్య మృతి చెందిన ఘటన తల్లాడ మండలంలోని బిల్లుపాడు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు కథనం మేరకు.. ఇటీవల నాలుగు రోజుల క్రితం సీనియర్ నాయకులు జక్కంపూడి కృష్ణమూర్తి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. జక్కంపూడి కృష్ణమూర్తి సతీమణి మాజీ గ్రామ సర్పంచ్ జక్కంపూడి ప్రేమలత (68) భర్త మరణం జీర్ణించుకోలేక బుధవారం తెల్లవారుజామున వారి ఇంటి వెనకాల పెరట్లో ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ పరిణామంతో బిల్లుపాడులో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. భార్త వెంట జీవితంలోనే కాదు చావులోను కలిసి నడుస్తానంటూ ప్రేమలత ఆత్మహత్యకు పాల్పడటం అందరితో కన్నీళ్లు పెట్టించింది.