సీపీ సార్ ఏన్కూర్ లో పోలీస్ క్వార్టర్స్ మోక్షం ఎప్పుడు?

ప్రజలు ప్రశాంతంగా జీవనం గడపాలంటే, పోలీస్ శాఖ తమ బాధ్యతలను నిర్వర్తించడం వల్లే జరుగుతుందనేది జగమెరిగిన సత్యం.

Update: 2025-03-24 03:19 GMT
సీపీ సార్ ఏన్కూర్ లో పోలీస్ క్వార్టర్స్ మోక్షం ఎప్పుడు?
  • whatsapp icon

దిశ, ఏన్కూర్ : ప్రజలు ప్రశాంతంగా జీవనం గడపాలంటే, పోలీస్ శాఖ తమ బాధ్యతలను నిర్వర్తించడం వల్లే జరుగుతుందనేది జగమెరిగిన సత్యం. ఆకతాయిల వికృతి చేష్టలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పై పోలీస్ శాఖ కొరడా ఝలిపిస్తూ గ్రామాల్లో ఎలాంటి అలజడులు లేకుండా ప్రశాంతంగా ప్రజలు జీవించేలా చేస్తుంటారు. అలాంటి విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి ఉండటానికి ప్రభుత్వం మంజూరు చేసిన క్వార్టర్స్ లేక, ప్రైవేటు ఇల్లు స్థానికంగా దొరకక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని గుర్తించిన ఆనాటి జిల్లా పోలీస్ సూపర్డెంట్ గా విధులు నిర్వహించిన భావన సక్సేన ఏన్కూర్ లో పోలీసు సిబ్బందికి స్టేషన్ వెనుక భాగంలో స్థలం కేటాయించారు.

అధికారిణి స్థలం కేటాయించడం కోసం ఎంతో కృషి చేశారు. పోలీసుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం అన్న ప్రభుత్వాలు విధులు నిర్వహించిన తర్వాత వారు అలసట తీర్చుకోడానికి కానీ, కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడపడానికి సిబ్బందికి క్వార్టర్స్ అవసరం. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అధికారి పిలిచినప్పుడు అందుబాటులో ఉండాలంటే స్థానికంగా పోలీస్ అందుబాటులో ఉండాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో పోలీస్ సిబ్బందికి క్వార్టర్స్ అనేది అవసరం. ఏన్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఎస్సై ఇద్దరు హెడ్ కానిస్టేబుల్, ఒక రైటరు, 20 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. క్వార్టర్స్ నిర్మాణం కోసం స్థలం కేటాయించి సంవత్సరాలు గడుస్తున్నా నిర్మాణానికి మోక్షం ఎప్పుడు వస్తుందనేది సిబ్బందికి అంతుబట్టని విషయం. ప్రస్తుతం ఖమ్మం జిల్లా సీపీ ప్రత్యేక దృష్టి సారించి ఏన్కూరు పోలీస్ సిబ్బంది కోసం క్వార్టర్స్ నిర్మాణం జరిపించాలని కోరుతున్నారు.


Similar News